‘నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ పక్కా మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. నటుడిగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రస్టిక్ విలేజ్ డ్రామాగా మెప్పిస్తుంది’ అన్నారు నారా రోహిత్. ఆయన ఓ ప్రధాన పాత్రలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్‌లతో కలిసి నటించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సందర్భంగా మంగళవారం నారా రోహిత్ విలేకరులతో పంచుకున్న విశేషాలు..