Sundara Kanda | ఇటీవల ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో క్రేజీ మూవీతో వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’(Sundara Kanda). వృతి వాఘని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 06న ప్రేక్షకుల విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ఇక టీజర్ చూస్తే.. నాది మూలా నక్షత్రం.. 5 నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను.. అంటూ తన దరిద్రమైన పాత్రను వ్యంగంగా రివీల్ చేశారు మేకర్స్. నారా రోహిత్ చాలా రోజుల తర్వాత ఫన్ ఎంటర్టైనమెంట్తో రాబోతున్నట్లు తెలుస్తుంది.
శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి , సునైనా , రఘు బాబు , అమృతం వాసు , అదుర్స్ రఘు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ. రోహన్ చిల్లాలే ఎడిటింగ్. ప్రొడక్షన్ డిజైన్: రాజేష్ పెంటకోట.
Also Read..