Hit 3 | సరిపోదా శనివారం హిట్‌తో జోష్ మీదున్న నాని (Nani) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి హిట్ 3 (HIT: The 3rd Case). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే నాని పాత్రకు సంబంధించిన స్నీక్ పీక్ గ్లింప్స్ షేర్ చేయగా.. మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది ఓ వార్త తెరపైకి వచ్చింది. తాజా టాక్ ప్రకారం కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఫైనల్ అయినట్టు ఇన్సైడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమాలో నటిస్తోంది. ఇదే నిజమైతే నాని సినిమా ఈ భామకు తెలుగులో రెండో ప్రాజెక్ట్ కానుంది. అర్జున్ సర్కార్ డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉండగా.. ప్రస్తుతం హిట్ 3 షూటింగ్ వైజాగ్‌లో కొనసాగుతోంది.
ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్‌లో అర్జున్ సర్కార్ సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2025 మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది.
Anushka Shetty | అనుష్క వెడ్డింగ్‌కు వేళాయె.. క్రేజీ వార్తలో నిజమెంత..?
Pooja hegde | విజయ్‌తో రొమాన్స్ వన్స్‌మోర్.. దళపతి 69 హీరోయిన్ ఫైనల్..!
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్