‘దసరా’ కాంబో రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి తెరకెక్కించబోతున్న తాజా సినిమా ప్రకటన ఇటీవలే వెలువడింది. సింగరేణి బ్యాక్‌గ్రౌండ్‌లో సాగిన ‘దసరా’ కథలో నాని ఊరమాస్ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు.
తాజా సినిమా కథ కూడా తెలంగాణ నేపథ్యంలోనే సాగుతుందని, అప్పటి వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఓ యువకుడి కథతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ సిద్ధం చేశాడని అంటున్నారు. మొత్తంగా ఓ మాస్ లీడర్ కథ ఇదని సమాచారం. సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్లో నాని మాస్ అవతారంలో కనిపించారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.