Nani | నేచురల్ స్టార్ నాని ఇప్పుడు రూట్ మార్చాడు. మాస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. దసరా తర్వాత హిట్ 3 అనే మాస్ మసాలా మూవీతో పలకరించడానికి రెడీ అయ్యాడు.ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి ‘ఏ’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సినిమా వీక్షించడానికి అనుమతి లేదని చెప్పారు. నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించగా, గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో నాని పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు.
నాని మొదట రాధాగోపాళం సినిమాకు అప్రెంటిస్ గా, క్లాప్ అసిస్టెంట్ గా పని చేశాడు. అనంతరం అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అయితే నాని తన మొదటి శాలరీ ఎంత తీసుకున్నాడు అనేది ఎవరికి తెలియదు. తాజాగా దాని గురించి మాట్లాడుతూ.. మొదట నేను అప్రెంటిస్‌గా, క్లాప్ అసిస్టెంట్‌గా పని చేశాను. అప్రెంటిస్‌కి సాలరీ ఉండదని నాకు ముందే చెప్పారు. సాలరీ రాకపోయిన పని చేశాను. చివరి షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత అందరికి శాలరీలు ఇస్తున్నారు. అలానే నాకు కూడా 2500 రూపాయల చెక్ ఇచ్చారు. అందరితో పాటు నేను విత్ డ్రా చేసుకోవాలని భావించాను.
20 రోజుల తర్వాత నేను విత్ డ్రా చేసుకోవడానికి వెళితే చెక్ బౌన్స్ అయిందని చెప్పారు. నిర్మాతకి ఏదో సమస్య ఉండడం వలన అలా జరిగింది. నాకు మళ్ళీ వెళ్లి అడగాలని కూడా అనిపించలేదు. ఇంక ఆ డబ్బులు రానట్టే, ఆ చెక్ పనిచేయదు అని తెలుసుకున్నా కూడా దానిని జాగ్రత్తగా దాచుకున్నాను అని తెలిపారు.ఇక అల్లరి బుల్లోడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని ఆ చిత్రానికి గాను నాలుగు వేలు రూపాయల సాలరీ పుచ్చుకున్నాడు. అప్పుడు చెక్ ఇవ్వబోతే భయంతో వద్దు అని క్యాష్ అడిగాడట. అప్పుడు అన్ని 100 రూపాయల నోట్లు ఇచ్చారు. ఓ నాలుగు నెలల డబ్బు దాచుకొని అమ్మ నాన్నలకు రింగ్స్ చేయించాను అంటూ నాని తాజా ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ‘హిట్’ సిరీస్‌లో గత చిత్రాలు విజయవంతం కావడం, ఈ సినిమాలో నాని పాత్ర పూర్తి భిన్నంగా ఉండనుందన్న ప్రచారం జరుగుతుండటంతో హిట్ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి.