NANI | ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు నాని. చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ని అలరిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకులకి విభిన్నమైన సినిమాలని అందించాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటారు. ఇక ఇప్పుడు నాని మాస్ హీరోగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడని అనిపిస్తుంది. హిట్ 3, ది ప్యారడైజ్ అనే చిత్రాలతో నాని ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నట్టు తెలుస్తుంది.
నాని నటించిన హిట్ 3 మూవీ మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో అర్జు్న్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఎప్పుడు కనిపించని పాత్రలో కనిపించి అలరించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నాని హీరోగానే కాకుండా అటు నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. కొత్త వాళ్లని పరిచయం చేస్తూ మంచి హిట్స్ కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇటీవల తన సొంత బ్యానర్ పై కోర్టు అనే చిన్న చిత్రాన్ని నిర్మించారు నాని. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే రామ్ జగదీష్ అనే మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
కోర్టు చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ మూవీ స్ట్రీమ్ అవుతుండగా, ఇందులోను మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కోర్టు మూవీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర నిర్మాత నాని దర్శకుడికి ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారట. నాని ఈ మధ్య కాలంలో చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్నా కూడా ఎక్కడా ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. కోర్టు డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసాడు. నాని చేతుల మీదుగా కారు బహుమతిగా తీసుకోవడం పెద్ద అచీవ్ మెంట్ అని చెప్పిన ఆ దర్శకుడు..ఈ విషయాన్ని ఆనందంగా అందరికీ చెప్పుకోవాలని ఉందని.. కానీ గిఫ్ట్ ఇచ్చి ఇలా బయటకు చెప్పుకోవడం నానికి ఇష్టం లేదని.. అందుకే ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు.