Nani | న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాతోపాటు శైలేష్ కొలను హిట్ 3 సినిమాలున్నాయి. కాగా ఇప్పుడు నాని మరో సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. 13 ఏండ్ల క్రితం వచ్చిన క్లాసికల్ సినిమా పిల్ల జమిందార్ (Pilla Zamindar) బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతుందన్న వార్త నెట్టింట రౌండప్ చేస్తోంది. జీ అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కోసం కథా చర్చలు కొనసాగుతున్నాయని నిర్మాత డీఎస్ రావు ఓ ఈవెంట్లో చెప్పారు. దీంతో పిల్ల జమిందార్ 2 ఎలా ఉండబోతుందోనంటూ.. అంటూ నాని అభిమానులు ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు.
అయితే సీక్వెల్ తెరకెక్కిస్తే ఎవరు డైరెక్ట్ చేస్తారు..? నాని ప్రస్తుతం NaniOdela 2, HIT 3, వివేక్ ఆత్రేయ సినిమాల కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న నేపథ్యంలో మరి పిల్ల జమిందార్ సీక్వెల్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు మొదలవుతాయి..? మరి నాని తన పాత్రను మళ్లీ రీప్లేస్ చేస్తాడా.. లేదంటే.. వేరే యాక్టర్ ఎవరైనా కనిపిస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రేజీ సీక్వెల్‌పై పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.
Kanguva | అభిమానులతో సూర్య, దిశాపటానీ సెల్ఫీ.. ఇంతకీ కంగువ టీం ఎక్కడుందో తెలుసా..?
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?