క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాల్లో ఒకటి హిట్ (HIT). ఈ సినిమాతో శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్టర్‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ప్రాంచైజీగా ప్లాన్ చేయగా.. ఇప్పటికే అడివిశేష్ హీరోగా హిట్ 2 కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సారి న్యాచురల్ స్టార్ నాని (nani)తో హిట్ 3 ఉండబోతుందని కూడా ఇప్పటికే ప్రకటించేశాడు శైలేష్ కొలను. పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 (HIT 3) భారీ స్థాయిలో ఉండబోతుంది. బాణసంచా లోడ్ అవుతోంది.. అంటూ శైలేష్ కొలను చాలా రోజుల క్రితమే అప్డేట్ ఇచ్చేశాడు.
అయితే హిట్ 3 ఎప్పుడు మొదలవుతుందనే అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా గురించి అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ పెట్టాడు నాని. హిట్ 3 గురించి ఓ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హిట్ 3కి సమయం పడుతుంది. హిట్ 3 మొదలవడానికి కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. నేను కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. శైలేష్ కు కూడా పలు ప్రాజెక్ట్‌లున్నాయి. ఖచ్చితంగా సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. కానీ కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు నాని.
నాని ప్రస్తుతం మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న దసరా చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నాని మరోవైపు డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో నాని 30 సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు.
దసరా ట్రైలర్..
దసరా మాస్ టీజర్..
.
నాని 30 గ్లింప్స్ వీడియో..
Ponniyin Selvan 2 | విక్రమ్ ఆదిత్య కరికాలన్‌గా మారాడిలా.. పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్ అప్డేట్