టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తోన్న (Aha OTT) ‘ఆహా’ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable). ఇప్పటికే రిలీజైన ఈ షో ప్రోమోతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. (Aha talk show) టాక్ షోకు ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు అతిథులుగా రానున్నారు. కాగా మంచు మోహన్ బాబు (Mohanbabu) తొలి ఎపిసోడ్లో కనిపించబోతున్నారు. కాగా ఈ షోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది.
న్యాచురల్ స్టార్ హీరో నాని కూడా ఈ షోలో మెరువనున్నాడన్న టాక్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అధికారికప్రకటన వస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి నాని, బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించడం ఇద్దరి అభిమానులకు ఎక్జయిటింగ్ వార్త అనే చెప్పాలి. అన్‌స్టాపబుల్ దీపావళి కానుకగా నవంబర్ 4 నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది.
ఈ టాక్ షోలో బాలకృష్ణతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండతోపాటు మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ఇతర సెలబ్రిటీలు సందడి చేయనుండగా..ఈ ఎపిసోడ్స్ కు సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
Puneet Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి