ఓటీటీలో దూసుకెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్.. వరల్డ్‌వైడ్‌గా రికార్డ్ వ్యూస్

Nani and Sai Pallavi Shyam singha roy movie in Netflix | నాని ప్రధాన పాత్రలో నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఓటీటీలో ప్రభంజనం సృష్టిస్తోంది. కరోనా సమయంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ నెల 21న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై.. సెన్సేషనల్ వ్యూయర్షిప్ సొంతం చేసుకుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి వారంలో ఇండియాలో ఆల్‌టైం హైయెస్ట్ వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా శ్యామ్ సింగరాయ్ చిత్రం సంచలన రికార్డు సృష్టించింది. ఇక గత వారం వరల్డ్‌వైడ్‌గా నాన్ ఇంగ్లిష్ మూవీస్ కేటగిరీలో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు.. కరోనా సమయంలోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్లో రూ.28 కోట్లు వసూలు చేసి అద్భుతమైన లాభాలు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన మరో చిత్రం అంటే సుందరానికి చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతోపాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా అనే యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇందులో ఇంతకుముందు ఎన్నడూ చూడని పాత్రలో నాని కనిపిస్తాడని సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
శ్యామ్ సింగరాయ్ రెమ్యునరేషన్ నాని వెనక్కి ఇచ్చేశాడా..?
Shaym singha roy | బుర్ఖాలో వెళ్లి సినిమా చూసిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

