పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్. సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పచ్చదనం పెంచాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ నందితా శ్వేత ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొంది. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే పచ్చదనం పెరగాలి. దాని కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. నా పుట్టినరోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’ అని చెప్పింది.