NBK 50 in TFI | టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. నేడు హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు కేంద్రమంత్రులు తదితర సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ వేడుకలో ఎవరెవరు పాల్గొంటున్నారు అనేదానికి సంబంధించి ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వేడుకకు వస్తున్న ముఖ్య అతిథుల లిస్ట్ చూసుకుంటే.. టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్, అక్కినేని నాగార్జున, గోపిచంద్. విక్టరీ వెంకటేశ్, అల్లరి నరేష్, విజయ్ సేతుపతి, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని, సిద్దు జోన్నలగడ్డ, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, సాయి దుర్గ తేజ్, నాగా శౌర్య తదితరులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే అందరికి ఆహ్వానాన్ని ఇచ్చారు కానీ సొంత కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు నందమూరి కళ్యాణ్‌కు మాత్రం ఇన్విటేషన్ పంపలేదని వార్తలు వస్తున్నాయి. ఇక సొంత ఫ్యామిలీకి ఆహ్వానం పంపకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ రెండుగా చీలుతారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read..