Ee Nagaraniki Emaindi | తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘ఈ నగరానికి ఏమైంది?’ ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ని అందుకుంది. అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సీక్వెల్‌ను ప్రకటించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘ఈNఈ రిపీట్’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రాబోతుండగా.. విశ్వక్ సేన్, సాయిసుశాంత్రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఈ సీక్వెల్లో కూడా హంగామా చేయనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వక్ సేన్‌కి బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం. ఇప్పటికే ఈ విషయాన్ని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. అయితే ఈ రిలేషన్‌తోనే బాలయ్యని ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో నటించమని విశ్వక్ అడిగినట్లు తెలుస్తుంది. దీనికి బాలయ్య కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. సురేష్ ప్రోడక్షన్ బ్యానర్‌పై డి.సురేశ్‌బాబు, సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.