విడుదలైన 19 రోజులకే ఓటీటీలో నాగార్జున వైల్డ్ డాగ్

ఈ రోజుల్లో కొత్త సినిమాలు ఓటీటీలో విడుదల కావడానికి మునపటిలా చాలా రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చి మరింత దూరం తగ్గించింది. ఇప్పటికే చాలా సినిమాలు అలాగే విడుదలయ్యాయి. కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కావాల్సింది. కానీ థియేటర్లు తెరవడంతో మనసు మార్చుకుని ఈ సినిమాను విడుదల చేశారు. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్లాప్ అయింది.. కనీసం రూ.10 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్ గా నిలిచింది.

NIA తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమెన్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమా అంత మంచి టాక్ సొంతం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 21 అర్థరాత్రి 12 గంటల నుంచి వైల్డ్ డాగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. అంటే కేవలం 19 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందన్నమాట.

థియేటర్లలో విడుదలైన 40-45 రోజులలో తమ వైల్డ్ డాగ్ సినిమా OTTలో విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఇంత త్వరగా ఉన్నట్లుండి ఓటీటీలోకి తీసుకొస్తుండటం మాత్రం ఆసక్తికరంగా మారింది. సయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు ఈ సినిమాలో నటించారు. హైదరాబాద్, ముంబై లాంటి ప్రదేశాల్లో జరిగిన బాంబ్ బ్లాస్టులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అహిషర్ సోలమన్. స్క్రీన్ ప్లే అదిరిపోయినా కూడా కలెక్షన్స్ మాత్రం అస్సలు రాలేదు. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా కనీసం ఓటీటీలో అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైరల్ పిక్
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కూతుర్ని గుండెలపై ఎక్కించుకున్న అల్లు అర్జున్.. వైరల్ పిక్
పుకార్లపై నవ్వుకున్న హరీష్ శంకర్..ఇంతకీ అదేంటంటే..?
శ్రీ రామ నవమికి విడుదలైన సినిమా పోస్టర్స్ ఇవే..
మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
మరోసారి ఇద్దరు భామలతో రొమాన్స్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు
ఒకేసారి థియేటర్లో, ఆన్లైన్లో రిలీజ్ కానున్న రాధే
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

