Nagarjuna | అక్కినేని నాగార్జున నటించిన ఐకానిక్ మూవీ శివ ఇటీవలే గ్రాండ్‌గా రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. రీరిలీజ్‌లో సూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంది శివ. ఇక మరోసారి శివ సినిమా నాటి వైబ్స్ క్రియేట్ చేస్తున్నాడు నాగార్జున. చైన్ బ్రాస్లెట్ను అరచేతిలో మడిచి పట్టుకున్న నాగార్జున బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాగుల్స్‌తో స్టైలిష్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చాడు.
‘1989 నాటి కాలం నుండి 2025 వరకు… అతడి తేజస్సు సున్నితంగా గాలిలా ప్రయాణిస్తుంది… అయినప్పటికీ అతడి చరిష్మా శాశ్వతమైనది.. సొగసైనది..మరపురానిది..’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన తాజా స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆరు పదుల వయస్సు దాటినా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ తాజా స్టిల్స్‌తో చెప్పకనే చెప్పేస్తున్నాడు నాగార్జున.
ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున. నాగార్జున ప్రస్తుతం కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయే 100వ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని నాగార్జున 2026 మే నెలలో సమ్మర్ కానుకగా అభిమానుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. నాగార్జున టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Manchu Lakshmi | మంచు లక్ష్మీ నో ఫిల్టర్ కామెంట్స్ వైరల్ .. సినీ పరిశ్రమ, సమాజంపై బాంబుల వర్షం