Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. రోజుకు కేవలం 8 గంటలే పని చేస్తాను అన్న ఆమె నిర్ణయం గతంలో పెద్ద సంచలనంగా మారింది. ఈ కండీషన్ కారణంగానే భారీ పాన్–ఇండియా చిత్రాలు ‘కల్కి 2’, ‘స్పిరిట్’ ప్రాజెక్టుల నుంచి దీపికా తప్పుకోవాల్సి వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక వివాదం ముగిసిందనుకున్న సమయంలో, దీపికా తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ..ఇప్పుడు నేనొక బిడ్డకుతల్లిని. తల్లయ్యాక మా అమ్మగారిపై గౌరవం మరింత పెరిగింది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది.
కొత్తగా బిడ్డకు జన్మనిచ్చి తిరిగి పనిలోకి వచ్చే మహిళలకు ఇండస్ట్రీ మరింత సపోర్టివ్‌గా ఉండాలి,” అని భావోద్వేగంగా చెప్పింది.అలాగే ఆమె 8 గంటల పని విధానం గురించి మరోసారి స్పష్టమైన వివరణ ఇచ్చింది. రోజుకు 8 గంటలు పని చేయడం శరీరానికి, మనసుకు హెల్తీ. ఒత్తిడిలో పనిచేస్తే అవుట్‌పుట్ మంచిగా రాదు. మా ఆఫీసు కూడా ఇదే రూల్‌ను ఫాలో అవుతుంది. టైమ్ చాలా విలువైనది. దాన్ని ఎవరితో, ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించుకోవడం నా హక్కు. నిజమైన సక్సెస్ అంటే అదే. 8 గంటలే పని చేయాలన్న నా నిర్ణయం ఇప్పటికీ సరైనదే,” అని స్పష్టం చేసింది.
దీపికా తాజా కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు దీనిపై చర్చిస్తున్నారు. కొందరు దీపికా నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు భారీ చిత్రాల షెడ్యూళ్లతో ఈ విధానం అమలు కావడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే .. దీపికా ఇప్పుడు షారూక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పరచింది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.మరోవైపు అల్లు అర్జున్ తాజా చిత్రంలోను దీపికా కథానాయికగా నటిస్తుంది. ఏది ఏమైన దీపికా 8 గంటల వర్క్ శరతు పై మాట్లాడిన వ్యాఖ్యలు మరోసారి బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారాయి.