Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తూ, పర్ఫెక్ట్ ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న హీరో అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. 66 ఏళ్లు వచ్చినా కూడా ఇంకా మన్మధుడిలా కనిపించే నాగ్… తన ఫిట్నెస్, హెల్త్, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందం, ఫిట్‌నెస్‌పై పలువురు హీరోలు కూడా బహిరంగంగానే ప్రశంసలు కురిపిస్తుంటారు.అయితే ఇంత కఠినమైన హెల్త్ డిసిప్లిన్ పాటించే నాగార్జున కూడా ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తన ఆరోగ్య సమస్య గురించి ఓపెన్‌గా వెల్లడించారు.
నాగార్జున మాట్లాడుతూ…“15 ఏళ్ల క్రితం నాకు మోకాలి నొప్పి మొదలైంది. అప్పటి నుంచి ఆ సమస్యతో బాధపడుతూనే ఉన్నాను. అయితే ఇప్పటివరకు నేను మోకాలి రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోలేదు. సర్జరీని పూర్తిగా అవాయిడ్ చేయాలనే ప్రయత్నం చేశాను” అని తెలిపారు. మోకాలు బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. PRP ట్రీట్మెంట్ కూడా చేయించాను. మోకాలు లోపల రీజనరేట్ అవ్వడానికి డాక్టర్లు ఎంతో సహాయం చేశారు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా కూడా నేను గ్యాప్ ఇవ్వకుండా ప్రతి రోజు ఉదయం మోకాలి కోసం రిహాబ్ చేశాను. నిరంతరం దానిపై వర్క్ చేశాను అని వివరించారు.
చాలా కాలంగా ఈ మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని నాగార్జున స్పష్టం చేశారు. నాకు సర్జరీ వద్దు. ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు సర్జరీని అవాయిడ్ చేయాలనే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు… నాగార్జున ఫిట్నెస్ వెనుక ఉన్న కష్టాన్ని, క్రమశిక్షణను మెచ్చుకుంటున్నారు. బయటకు ఎంత యంగ్‌గా కనిపించినా… ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో ఈ మాటలతో మరోసారి స్పష్టమైందని అంటున్నారు. మొత్తానికి… నాగార్జున ఫిట్నెస్ కేవలం జిమ్ వర్కౌట్ కాదు… అది సంవత్సరాల పాటు చేసిన క్రమశిక్షణ, నిరంతర కేర్‌కు నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.