టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna) నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రాల్లో ఒకటి ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ప్రాజెక్టు. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే కాజల్ ప్రెగ్నెన్సీ రూమర్ల కారణంగా మేకర్స్ కొత్త హీరోయిన్ను వెతికే పనిలో ఉన్నారని టాలీవుడ్ సర్కిల్ టాక్. కాజల్ స్థానంలో అమలాపాల్ (Amala Paul)ను తీసుకోవాలని ఆమెను సంప్రదించగా..భారీగానే డిమాండ్ చేసి మేకర్స్‌కు షాకిచ్చిందట అమలాపాల్. ఇటీవలే ప్రవీణ్ సత్తారు టీం మెహరీన్ కౌర్‌ను కూడా సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.
మెహరీన్ కూడా మేకర్స్ ను రూ.కోటి రెమ్యునరేషన్ అడిగిందట. నాగార్జునలాంటి సీనియర్ హీరోతో రొమాన్స్ చేయాలంటే మెహరీన్ భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో మేకర్స్ అప్సెట్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఇక హీరోయిన్ల వైఖరితో విసిగిపోయిన నిర్మాతలు కాజల్ స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ వేటలో పడ్డారట. మరి నాగార్జున-ప్రవీణ్ సత్తారు సినిమాలో ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతానికి బంగార్రాజు (Bangarraju) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నాగార్జున. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చేస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. నాగచైతన్య, కృతిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Lavanya Tripathi Gossip | లావణ్య త్రిపాఠిపై సర్ప్రైజ్ గాసిప్ హల్చల్
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్