నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ సినిమా షెడ్యూల్ దుబాయ్‌లో తిరిగి ప్రారంభమైంది. స్పైథ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దుబాయ్ షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ‘ఓ గూఢచారి కథ ఇది. నాగార్జున పాత్ర ైస్టెలిష్‌గా ఉంటుంది. గూఢచారి రహస్య ఆపరేషన్ ఏంటనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సోనాల్‌చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.