NC22 Movie Update | ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేకులు వేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 22న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. కథ, కథనం స్లోగా ఉండటం, విక్రమ్‌కుమార్ మార్క్ ఎక్కడా కనిపించకపోవడం సినిమా ఫేయిల్యూర్కు పెద్ద కారణం అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ‘ధూత’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇది షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
ఇటీవలే ‘మానాడు’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతన్య తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా ఓ బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం కానున్నట్లు ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
With all ur love and blessings beginning my next #VP11 tomorrow with @chay_akkineni #NC22 @SS_Screens YES the shoot begins tomorrow @ilaiyaraaja @thisisysr pic.twitter.com/0ugXmSgDRD
— venkat prabhu (@vp_offl) September 20, 2022
Read Also:
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ మూవీ బిజినెస్ వాల్యూ అన్ని కోట్లా?
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Priyanka Arul Mohan | నాని హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!