Thandel | టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం తండేల్ (Thandel). చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో చైతూ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
కాగా మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తొలి వారం రోజులపాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తాజా ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ.197, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.252గా ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వెసులు బాటు లేకుండా ధరల పెంపు, బెనిఫిట్స్ షోల విషయంలో కఠిన పాలసీని అమలు చేస్తోంది. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ చిత్రంలో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో కనిపించనుంది. తండేల్ గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్త్తున్నాయి. తండేల్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
Pushpa 2 The Rule | పుష్పరాజ్ మేనియా కంటిన్యూ.. ఇక మరో భాషలో అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్..!
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?