Aay | నార్నే నితిన్ (Nithin), నయన్ సారిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఆయ్’ (Aay). గోదావరి బ్యాక్ డ్రాప్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేయగా.. ఆగస్ట్ 15న సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.
తండేల్ టీం కోసం ఆయ్ స్పెషల్ ప్రివ్యూ ఏర్పాటు చేశారు. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాత బన్నీ వాసు అండ్ టీం సినిమా చూసిన అనంతరం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దిగిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆయ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో రాజ్‌కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మిమే గోపి ఇతర కీలక పాత్రల్లో నటించారు. అజయ్ అరసాడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రామ్ మిర్యాల బాణీలు సమకూర్చాడు.
Team #Thandel joins the #AAYFunFestival 🥳💥⚓️
Yuvasamrat @chay_akkineni and @Sai_Pallavi92 praised & congratulated the entire team of #AAYMovie for the blockbuster success after watching a special preview❤️🔥😍
Book Your Tickets for the Laugh Riot!❤️
🎟 https://t.co/NXxsxK38yo pic.twitter.com/N5ql8vxbY9
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్