Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఇప్పటికే విడుదల చేసిన బుజ్జి తల్లి సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా తండేల్ సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. శివశక్తి ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చైతూ, సాయిపల్లవి శివతాండవం చూపించబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#Thandel second single #ShivaShakti out on 22nd Dec in Telugu, Hindi & Tamil 👁️#Thandel #ThandelonFeb7th pic.twitter.com/b4IN65wCg2
— BA Raju’s Team (@baraju_SuperHit) December 18, 2024
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?