నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా NC 22. తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది. బంగార్రాజు సినిమా తర్వాత కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే ప్రీ లుక్ పోస్టర్ (NC 22 Pre Look) ఒకటి విడుదల చేశారు మేకర్స్.
చైతూ ఇందులో శివ అనే పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్టు ప్రీ లుక్‌తో అర్థమవుతుంది. పోలీసులు శివ చుట్టూ చేరి పిస్తోళ్లు పట్టుకుని, అతన్ని అదిమిపట్టడం పోస్టర్లో చూడొచ్చు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు డైరెక్టర్.
NC 22 చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇటీవలే హైదరాబాద్ లో ఎన్సీ 22 యాక్షన్ షెడ్యూల్ మొదలైంది. భారీ సెట్టులో యాక్షన్ షెడ్యూల్ కొనసాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు.
NC 22 ప్రీలుక్ పోస్టర్..
Presenting the Fierce Pre Look Poster of #NC22 🔥
The First Look & Title will be out on NOV 23rd at 10:18 AM 🤩💥#NC22Celebrations 🥳@chay_akkineni @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens @srinivasaaoffl #Priyamani @realsarathkumar #VP11 pic.twitter.com/mJf2PFgF0D
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2022
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్