లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరిగింది. సినిమాలకు దీటుగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిరీస్‌లను తెరకెక్కించే ధోరణి ఎక్కువ కావడంతో వీటిలో భాగమయ్యేందుకు అగ్ర నాయకానాయికలు ఆసక్తిని చూపుతున్నారు. తాజాగా నాగచైతన్య ఓ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలిసింది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకోనున్న ఈ వెబ్‌సిరీస్‌లో నాగచైతన్య పాత్ర ప్రయోగాత్మక పంథాలో సాగనున్నట్లు సమాచారం. శరత్‌మరార్ ఈ సిరీస్‌ను నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ‘థాంక్యూ’తో పాటు హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌లతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే వెబ్‌సిరీస్‌ను సెట్స్‌పైకి తీసుకురానున్నట్లు తెలిసింది.