Nag Ashwin | మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
కాగా ఈ చిత్రం జనవరి 3 2025న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపనీస్ మూవీ లవర్స్ కురిపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోతున్నాడు నాగ్ అశ్విన్. ఈ స్టార్ డైరెక్టర్‌కు ఘన స్వాగతం పలుకుతూ జపనీస్ ఫ్యాన్స్ పంపించిన లెటర్లతో ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బెడ్‌షీట్‌లో లెటర్స్ పెట్టి వాటి మధ్యలో పడుకున్న స్టిల్‌ను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇలా పొంగిపోయేలా చేయడం అత్యంత అరుదైన విషయం. కానీ జపనీస్ ప్రేమ అలాంటివి. వారు నేర్చుకొని మరి తెలుగు లిపిలో రాశారు. మీ అందరి ప్రేమకు Arigato gozaimas (జపనీస్‌లో ధన్యవాదాలు అని అర్థం). మీరందరూ కల్కి 2898 ఏడీని ఎప్పుడు ఆస్వాదిస్తారా..? అని ఎక్జయిటింగ్ ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫీలింగ్‌ను అందరితో షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
#Kalki2898AD Japan release on Jan 3, 2025🔥
Time for the Japanese audience to go mad 🙏 #Prabhas #NagAshwin pic.twitter.com/W6X4yJiRIS
— Thyview (@Thyview) December 18, 2024
Vijay Sethupathi | టాలీవుడ్ డెబ్యూకు విజయ్ సేతుపతి రెడీ.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో మరి..?