e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News అజిత్ వాలిమై ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. ఫ్యాన్స్‌కి ఇక పండ‌గే..!

అజిత్ వాలిమై ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. ఫ్యాన్స్‌కి ఇక పండ‌గే..!

త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల‌లో అజిత్ కూడా ఒక‌రు. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న సినిమాలు వ‌రుస విజ‌యాలు సాధిస్తుండ‌డంతో అభిమానులు అజిత్ సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం వాలిమై అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డానికి చాలా రోజుల స‌మ‌యం తీసుకున్నారు మేక‌ర్స్. రీసెంట్‌గా లుక్ విడుద‌ల కాగా, ఇది ఫ్యాన్స్‌కి పిచ్చిగా న‌చ్చేసింది.

వాలిమై సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు . హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వాలిమై’ సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్ గా తెర‌కెక్కిస్తుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు. నాంగ వీర మారి అంటూ సాగే ఈ సాంగ్‌కి యువ‌న్ శంక‌ర్ రాజా అదిరిపోయే బీట్స్ ఇచ్చారు. ఈ పాట శ్రోత‌ల‌ని బాగా ఆక‌ట్టుకుంటుంది.

- Advertisement -

చిత్రంలో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాదే వాలిమై చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana