Thalapathy Vijay | తమిళ అగ్రనటుడు విజయ్ నటిస్తున్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’. వెంకట్‌ప్రభు దర్శకుడు. కల్పతి ఎస్.అఘోరం, కల్పతి ఎస్.గణేశ్, కల్పతి ఎస్.సురేశ్ నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీసంస్థ మైత్రీమూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి. సొంతం చేసుకున్నారు. రెండు తెలుగురాష్ర్టాల్లో భారీగా సినిమాను విడుదల చేయనున్నట్టు వారు తెలిపారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహా, లైలా కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, సంగీతం: యువన్ శంకర్‌రాజా, నిర్మాణం: ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్.