ఇటీవలే మీట్ క్యూట్ (Meet Cute)వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది న్యాచురల్ స్టార్ నాని సోదరి దీప్తి ఘంట (Deepthi Ganta) . అంథాలజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహానీశర్మ, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, సునయన ప్రధాన పాత్రల్లో నటించారు. Sony LIVలో స్ట్రీమింగ్ అవుతున్న మీట్క్యూట్కు మంచి స్పందనతోపాటు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
మీట్‌క్యూట్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దీప్తి ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం ఎలా మొదలై.. ఎలా సాగిందో చెబుతూ పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రజలు తనను అదృష్టవంతురాలిననడం, కొంతమంది నెపోటిజమ్ (బంధుప్రీతి) ప్రస్తావించడం గురించి దీప్తి ఘంట చెబుతూ.. ‘నాకు రాయడమంటే ఇష్టం.అందువల్లే మీట్ క్యూట్ కోసం కొన్ని కథలు రాయడం ప్రారంభించాను. నా సామర్థ్యాన్ని చూసి ఇంకా ఎక్కువగా రాయాలని కోరడమే కాదు.. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని అన్నాడు నాని (nani).
అంతేకాదు నాని ఈ కథలను డైరెక్ట్ చేసేలా నన్ను ప్రోత్సహించడం వల్లే పేపేర్లో రాసుకున్న విజన్ అలాగే స్క్రీన్ మీద కూడా కనిపించింది. మీట్క్యూట్కు మంచి స్పందన రావడంతో నాని ముఖంలో కనిపించిన అనుభూతిని చూసి నేను చాలా సంతోషంగా ఫీలయ్యా..’అంటూ నానితో చిన్నతనంలో దిగిన అరుదైన ఫొటోలతోపాటు మీట్ క్యూట్ లొకేషన్లో ఇద్దరు ఉన్నపుడు తీసిన స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన మధురమైన క్షణాలను అందరితో పంచుకుంది దీప్తి.
మీట్ క్యూట్ చిత్రంలో సత్యరాజ్, రోహిణి, దీక్షిత్ శెట్టి ఇతర కీలక పాత్రలు పోషించారు. మీట్ క్యూట్ సినిమాకు విజయ్ బల్గానిన్ సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్ నేనితో కలిసి తెరకెక్కించాడు.
నానితో దీప్తి ఘంట మెమోరబుల్ పోస్ట్..
Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also :RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!
మీట్ క్యూట్ ట్రైలర్..వీడియో
5 Meet-ups, 5 Cute Moments, 5 Stories and 1 lovely feeling.
Nani Presents, "Meet Cute" a Telugu anthology directed by Deepthi Ganta is streaming from Nov 25th on Sony LIV. #MeetCute #SonyLIVInternational #MeetCuteStoriesOnSonyLIV pic.twitter.com/V34VPmo9EC— Sony LIV International (@SonyLIVIntl) November 18, 2022