My South Diva Calendar | ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘మై సౌత్ దివా క్యాలెండర్-2025’ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కలర్ఫుల్గా జరిగింది. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పాలక్ అగర్వాల్ ఈ క్యాలెండర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడారు. క్యాలెండర్‌ను సపోర్ట్ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 12 మంది హీరోయిన్స్‌తో కూడిన క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానన్నారు. తమ క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురిని మోడల్స్‌గా పరిచయం చేశానన్నారు. ఇందులో హీరోయిన్స్‌గా గుర్తింపు పొందారన్నారు. ఈ ఏడాది మరో ఐదుగురిని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మద్దతు తెలిపిన భారతి సిమెంట్స్, కియారా జ్యువెలరీ, ఈరా క్లినిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు పేర్కొన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ ‘పలాస’ మూవీ టైమ్‌లో మనోజ్ ఇచ్చిన సపోర్ట్ మరువలేనన్నారు. ఇప్పటికీ సినిమాల్లో హీరోయిన్స్ కోసం ఆయన రెఫరెన్స్ తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ‘పలాస’ చిత్రాన్ని మార్చి 6న రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘సౌత్ దివా క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నారు. ‘హైడ్ అండ్ సీక్’ మూవీ హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ మర్చిపోలేనిది అని పేర్కొంది. మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఈ క్యాలెండర్ ద్వారా చాలా మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుందని పేర్కొన్నారు. హీరోయిన్స్ ఐశ్వర్య కృష్ణ, పాలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి, జెస్సీ మాట్లాడుతూ మాట్లాడుతూ మై దివా క్యాలెండర్ తొమ్మిదో ఎడిషన్‌లో భాగం కావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు.