సంజోష్ తగరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మై లవ్’. హర్షిత కథానాయిక. ఆర్.వి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. అతిథులంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
కొత్త కంటెంట్‌తో కూడిన సందేశాత్మక చిత్రమిదని దర్శకుడు, హీరో సంజోష్ తగరం చెప్పారు. మంచి కథ, కథనాలతో సినిమా రూపొందుతున్నదని నిర్మాత తెలిపారు. తనికెళ్ల భరణి, మురళీధర్‌గౌడ్, పృథ్వీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాహిల్, కెమెరా: వెంకట్రాజు, నిర్మాణం: జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్.