Tollywood | వాణి విశ్వనాథ్ కూతురితో కోటి కొడుకు సినిమా

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంత మంది ఉన్నారో ప్రత్యేకంగా లెక్కలు వేసి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్లు కూడా తమ వారసులను హీరోలుగానే తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ సంగీత దర్శకుడు కోటి వారసుడు రాజీవ్ సాలూరి హీరోగా గుర్తింపు కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడో 15 ఏళ్ల కింద నోట్‌బుక్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇంకో సినిమాతో వస్తున్నాడు ఈయన. ఇందులో సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్గా పరిచయం అవుతుంది. ఈ సినిమాలో కోటి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్ జంటగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభం అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. పవన్ కె అచల మాటలందిస్తున్న ఈ సినిమాలో సదన్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎక్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్‌లో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
గోవాలో రోడ్డు ప్రమాదంలో ప్రియుడితో పాటు హీరోయిన్ దుర్మరణం
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షో..
పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

