‘అగధ’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో టెక్నీషియన్స్ పనితనం, నటీనటుల నటన ఎలా ఉండబోతున్నదో టీజర్ చూస్తే అర్థమైవుంటుంది. ఇదో విజువల్ వండర్. టీజర్లో చూపించని ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని ఎంఎస్ రాజు అన్నారు. వాన, డర్టీ హరి చిత్రాల ద్వారా దర్శకునిగా కూడా సత్తా చాటిన అగ్ర నిర్మాత ఎంఎస్‌రాజు దర్శకత్వంలో రానున్న మూడో సినిమా ‘అగధ’.
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సుజ్జు, రోషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాశీ విశాలాక్షి బులుసు నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. గురువారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఎస్‌రాజు మాట్లాడారు. ఇందులో మహాదేవిగా కనిపిస్తానని, ఈ ప్రయాణంలో సహకరించిన ఎంఎస్‌రాజుకు కృతజ్ఞతలని నటి కామాక్షి భాస్కర్ల చెప్పారు. ఇంకా నటీనటులు శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, వనితా విజయ్‌కుమార్, ప్రముఖ జర్నలిస్టులు ప్రభు, నాగేంద్రకుమార్, సురేశ్ కొండేటి, రాంబాబు, నిశాంత్ కూడా మాట్లాడారు.