చంపత్రాయ్కి క్లీన్చిట్!.. అయోధ్య విరాళాల కేసులో సిట్ నివేదిక
అయోధ్యలో రామ మందిరంలో విరాళాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నిరపరాధిగా తేల్చింది.
అయోధ్య, ఆగస్టు 18: అయోధ్యలో రామ మందిరంలో విరాళాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నిరపరాధిగా తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదికను ఉత్తర్ ప్రదేశ్ హోం శాఖ అధ్యయనం చేస్తున్నదని క్షేత్ర ట్రస్టుకు అందచేస్తుందని అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి.
విరాళాలు చోరీ ఆరోపణలపై విచారణ జరుగుతుండటంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఇద్దరు జూన్లో ట్రస్టులోని తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి మొదటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన రెండవ సిట్ ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నది.
తుది దశకు సీఈవో ఎంపిక
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 16 మంది అభ్యర్థులు షార్ట్లిస్ట్ అయ్యారు. ఈనెల 11, 12 తేదీలలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. జస్టిస్(రిటైర్డ్) ఫెర్మోడ్ కోహ్లి, లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) వీకే చతుర్వేది, అణు శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ హవ్రేలతో కూడిన సెర్చ్ కమిటీ కీలకమైన సంస్థాగత నాయకత్వ పదవికి అభ్యర్థులను మూల్యాంకనం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

