Sandeep Reddy Vanga | ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni) యానిమల్(Animal Movie) సినిమాలో నటించాడు. ధోని ఏంటి యానిమల్ సినిమా ఏంటి అనుకుంటున్నారా విషయం ఉందండి. ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ఈమోటోరాడ్(Emotorad). తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనిని నియమించుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ధోనీతో కలిసి ఒక యాడ్‌ను విడుదల చేసింది ఈ కంపెనీ. ఇందులో యానిమల్ సినిమాలో ఎంఎస్ ధోని నటిస్తే ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు ఫన్నీగా దింపారు దర్శకుడు సందీప్ రెడ్డి.
ఎంఎస్ ధోని యానిమల్ సినిమాలో రణ్విజయ్ సింగ్(యానిమల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ పాత్ర పేరు)లా కనిపించడం.. ఇంటర్వెల్‌కి ముందు బ్లూ కోట్ లో బ్లాక్ కలర్ కార్ నుంచి దిగే సీన్, సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లే సీన్, క్లైమాక్స్ లో సైగ చేసి చూపించే సీన్. ఇలా రణ్‌బీర్ చేసే ప్రతి సీన్‌ని ధోనితో చేయించాడు సందీప్. ఫుల్ ఫన్ ఎంటర్టైనర్గా ఉన్న ఈ స్పూఫ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.