Raj Nidimoru | గత కొద్ది రోజులుగా నటి సమంత వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. డిసెంబర్ 1న ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో కోయంబత్తూరులో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకలో దాదాపు 30 మంది మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి రోజు సమంత ఎరుపు రంగు బెనారసి చీరలో అలరించగా, రాజ్ నిడిమోరు సింపుల్ కుర్తా–పైజామాలో కనిపించారు.ఈ వివాహం తర్వాత “సమంత మతం మార్చుకుందా?” అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది.
రాజ్ నిడిమోరు హిందువు కావడంతో, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిందని అనుకున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ సమంత క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి సమంత లేదా ఆమె బృందం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆమె గతంలో నాగ చైతన్యతో పెళ్లి చేసుకున్నప్పుడు రెండు మతాల ప్రకారం వివాహం జరగడం తెలిసిందే. మరోవైపు సమంత ఇటీవల దేవాలయ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి విషయాల కారణంగా “ఆమె హిందూ ధర్మానికి దగ్గరైంది” అని కొందరు భావిస్తున్నప్పటికీ,వీటిపై క్తారిటీ లేదు.
ఇక సమంత భర్త రాజ్ నిడిమోరు పాపులర్ డైరెక్టర్ అనే విషయం మనందరికి తెలిసిందే. కాని ఆయనలో మంచి సింగర్ కూడా దాగి ఉన్నాడు. తాజాగా ఆయన పాడిన డివోషనల్ పాటకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ మనోడు సమంతని తన పాటతోనే పడేసి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. కాగా సినీ పరిశ్రమలో సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్న శోభారాజ్.. స్వయంగా దర్శకుడు రాజ్ కు చిన్నమ్మ అవుతారు. అలా రాజ్ కూడా మంచి సింగర్ గా మారి ఉంటాడేమో అని ముచ్చటించుకుంటున్నారు.