Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ వార్డులో ఓటింగ్ నిలిచిపోయింది. మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించ లేదు. వార్డు సభ్యుడి ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేశారు. అయితే, ఎన్నికల సంఘం తరఫున వచ్చిన బ్యాలెట్ పత్రాలత్లో యాదయ్య అనే అభ్యర్థికి కేటాయించిన గుర్తు కనిపించలేదు. దాంతో ఓటర్లంతా షాక్ అయ్యారు. ఒక అభ్యర్థికి గుర్తు కేటాయించపోవడంతో సదరు అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.