Allari Naresh | అల్లరి నరేష్ నటించిన ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా నవంబర్ 21న థియేటర్లలో విడుదలై పెద్దగా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. మొదటిసారి హారర్–సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్న నరేష్ ఈ సినిమా ద్వారా విభిన్నమైన ప్రయోగం చేశాడు. నాని కసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించగా, కథను ప్రముఖ రచయిత, దర్శకుడు పొలిమేర అందించడం వల్ల సినిమాపై ముందు నుండే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అల్లరి నరేష్ కామెడీ హీరో ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సీరియస్ హారర్ జానర్లో అడుగుపెడుతుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. కథనం రొటీన్‌గా ఉందని, హారర్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదని ప్రేక్షకులు పేర్కొన్నారు. దీంతో చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమైంది.బాక్సాఫీస్ కలెక్షన్లు ఆశించిన స్థాయికి చేరకపోవడంతో మేకర్స్ పెద్దగా గ్యాప్ లేకుండా ఈ సినిమాను ఓటిటీలోకి తీసుకువచ్చారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాకు ఓటిటీ హక్కులు దక్కించుకుంది.
ఇప్పుడు డిసెంబర్ 10 నుంచి ‘12ఏ రైల్వే కాలనీ’ ప్రేక్షకుల కోసం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం. హారర్, థ్రిల్లర్ జానర్స్‌ను ఆసక్తిగా చూస్తారు కాబట్టి, ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో మంచి వ్యూయర్షిప్ అందుకునే అవకాశం ఉంది. అల్లరి నరేష్ కొత్తగా చేసిన ఈ ప్రయోగం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో క్లిక్ చేసి చూడొచ్చు.