బాలీవుడ్ కథానాయిక మృణాల్ ఠాకూర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. దుల్కార్ సల్మాన్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. అశ్వినీదత్, ప్రియాంకదత్ నిర్మాతలు. ఆదివారం మృణాల్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపిస్తారు. ఆయన సరసన సీత పాత్రలో మృణాల్ నటిస్తోంది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తాం. ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తయింది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్.