దాదాపు 12ఏళ్ల క్రితమే మరాఠీ సినిమాల ద్వారా కథానాయికగా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అంతకు ముందే అక్కడ టీవీ ధారావాహికల ద్వారా పాపులర్ అయింది. అయితే తొలి తెలుగు చిత్రం ‘సీతారామం’తో ఈ భామకు ఇండస్ట్రీలో బ్రేక్ దొరికింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలకు సమప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నది మృణాల్ ఠాకూర్. తాజా సమాచారం ప్రకారం ఈ సొగసరి తమిళ సినిమాల్లో సైతం అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నది.
శింబు 51వ చిత్రంలో మృణాల్ ఠాకూర్‌ను కథానాయికగా ఖరారు చేశారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీయస్ ఎంటర్టైనర్మెంట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఏప్రిల్‌లో షూటింగ్‌ను ప్రారంభిస్తారు. శింబు వంటి అగ్ర హీరో సరసన అవకాశం కావడంతో కోలీవుడ్‌లో ఈ భామకు శుభారంభం దక్కినట్లేనని తమిళ సినీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలతో బిజీగా ఉందీ భామ. ఇక తెలుగులో అల్లు అర్జున్-అట్లీ పాన్ వరల్డ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది మృణాల్ ఠాకూర్.