Fauji | అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి (Hanu Raghavapudi) సీతారామం తర్వాత ప్రభాస్ (Prabhas)తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. `ఫౌజీ`(Fauji) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం 2024 ఆగస్టు 17న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ఫిలిం నగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నట్టు చాలా రోజుల నుంచి అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు సోషల్ మీడియా ద్వారా తెరదించింది మృణాల్ ఠాకూర్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోయేది నిజమేనా..? అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఓ నెటిజన్ కామెంట్‌కు మృణాళ్ ఠాకూర్ స్పందిస్తూ సారీ ఫౌజీ చిత్రంలో నేను భాగమవ్వడం లేదు.. అంటూ రిప్లై ఇచ్చింది. మొత్తానికి సీతారామం తర్వాత మరోసారి హనురాఘవపూడి సినిమాలో నటించడం లేదని మృణాళ్ ఠాకూర్ ఇచ్చిన ఈ సమాధానంతో నిరాశలో మునిగిపోతున్నారు ప్రభాస్ అభిమానులు.
ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. సీతారామం, రాధేశ్యామ్ లా వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందని తెలుస్తోండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాల మధ్యలో ఫౌజీ చిత్రానికి ఎప్పుడు టైం ఇస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్