Dacoit | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్ర షూటింగ్లో అనుకోని ఘటన చోటుచేసుకోవడంతో ప్రధాన నటులు ఇద్దరు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ వారిద్దరికీ స్వల్ప గాయాలే అయ్యాయని సమాచారం. ఈ సినిమాకి షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ స్టంట్ సన్నివేశం సమయంలో, అడివి శేష్, మృణాల్ అనుకోకుండా కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనప్పటికీ, పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సెట్లోనే ప్రాథమిక చికిత్స తీసుకుని, మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేశారు.
పనిపట్ల వారి డెడికేషన్ చూసి చిత్ర యూనిట్‌తో పాటు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. యాక్షన్, థ్రిల్లింగ్ కథనంతో పాటు అద్భుత విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి.అడివి శేష్ ఇటీవల వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ 2’ లాంటి చిత్రాలతో కమర్షియల్ విజయాలు అందుకున్నాడు. మరోవైపు మృణాల్ ఠాకూర్, ‘సీతారామం’ సినిమా ద్వారా తెలుగులో భారీ క్రేజ్ సంపాదించింది. త్వరలో ఆమె అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందే చిత్రంలోనూ నటించనుంది.
‘డెకాయిట్’ షూటింగ్లో ఈ చిన్నపాటి ప్రమాదం చిత్ర యూనిట్‌కి కాస్త గందరగోళాన్ని కలిగించినా, హీరో-హీరోయిన్లు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శేషూ, మృణాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు బాగానే ఉన్నారని అప్డేట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన తర్వాత, ‘డెకాయిట్’పై మరింత ఆసక్తి పెరిగింది. సినిమా విడుదల కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.