TheaterVsOTT | హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్త సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఒక సినిమా విడుదలైన దాదాపు 6 వారాల నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేవి. అయితే సినిమా విడుదలకు ముందే చిత్ర నిర్మాతలతో ఓటీటీ వేదికలు ఒప్పందం చేసుకుంటుండంతో విడుదలైన నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. ఇటీవలే వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్ చిత్రాలతో పాటు లేటెస్ట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీతో పాటు కాంతార చిత్రాలు కూడా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకున్నాయి. అయితే ఇది ఇలానే కొనసాగుతుంటే చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలకి భారీ ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పటికే అగ్ర హీరోల సినిమా విడుదలకు ముందు టికెట్ ధరలతో విసిగిపోయిన ప్రజలు ఓటీటీలోకి వచ్చాక చూద్దామని డిసైడ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓటీటీ వేదికలు కూడా నెలలోపే అనౌన్స్మెంట్ ఇస్తుండటంతో ఈ ప్రభావం థియేటర్లపై మరింత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఫిలిం నగర్ పెద్దలు ఎలా స్పందిస్తారనది చూడాలి.