Dhurandhar | బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike) వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే రణ్వీర్ సింగ్ ఇందులో రా ఏజెంట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. స్పైగా పాకిస్తాన్కి వెళ్లిన రణ్వీర్ సింగ్ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. ఫుల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.