‘90 మిడిల్‌క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకుడు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్యహాసన్ నిర్మించారు. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘జియో సిమ్ రాకముందు జరిగిన కథంటూ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది.
సైనిక్‌పురిలో ఉండే అఖిల్, వాయుపురిలో ఉండే కాత్యాయని మధ్య నడిచే ప్రేమకథగా చూపించారు. చదువులో పూర్ స్టూడెంట్స్ అయిన వీరిద్దరి ప్రేమకథకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? చివరకు అఖిల్, కాత్యాయని ఒక్కటయ్యారా? అనే అంశాలతో ట్రైలర్ వినోదంతో పాటు ఎమోషన్‌ను పండించింది. సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనితచౌదరి, సత్యకృష్ణన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమల్లి, రచన-దర్శకత్వం: సాయి మార్తాండ్.