మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్యహాసన్ నిర్మించిన ఈచిత్రం ఇటీవల విడుదలై విజవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
హీరో అడవిశేష్, దర్శకులు మారుతి, రాహుల్ రవీంద్రన్, కేవీ అనుదీప్, నిర్మాత ఎస్కేఎన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులతోపాటు చిత్రాన్ని విడుదల చేసిన బన్నీవాస్, వంశీ నందిపాటి, రచయిత బీవీఎస్ రవి కూడా పాల్గొన్నారు.