ఇటీవలే హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ (Sandalwood) పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) నివాసానికి ప్రముఖుల తాకిడి పెరిగింది. మంగళవారం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున బెంగళూరులోని శివరాజ్‌కుమార్ (పునీత్ సోదరుడు) నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) కూడా శివరాజ్‌కుమార్ నివాసానికి వెళ్లారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబసభ్యులను ఓదార్చారు.
‘ఇది తీరని లోటు..నా సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుంది. పునీత్ లేరనే వాస్తవాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..జీర్ణించుకోలేకపోతున్నా..ఇది నిజంగా జరిగిందా..? అనే సందిగ్ధంలో ఉన్నా. నాకు మాటలు రావట్లేదని అన్నారు. నేను కలుసుకున్న అత్యంత ఆప్యాయమైన, ప్రేమగల వ్యక్తి పునీత్ రాజ్‌కుమార్. ఆయన ప్రేమతో అందరినీ సొంతం చేసుకున్నాడు. మనిషిగా ఉండటమంటే ఏమిటో నేను గుర్తు చేసుకున్నా’నన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ మీరు ఎక్కడ ఉన్నా మేమంతా చాలా ప్రేమిస్తూనే ఉంటాం. మేమంతా నిన్ను ఎప్పటికీ కోల్పోతున్నాము. పునీత్ అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అభిమానులు, ఫాలోవర్లు ఎవరూ నిరుత్సాహపడొద్దు. పునీత్ ఎల్లప్పుడూ ఆదరించే వారసత్వాన్ని మనందరికీ మిగిల్చాడు..అని చెప్పుకొచ్చారు రాంచరణ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?