నయనతార లీడ్‌రోల్ చేస్తున్న పాన్ ఇండియా భక్తిరసాత్మక చిత్రం ‘ముకూతి అమ్మన్ 2’. ఈ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదల కానుంది. సుందర్.సి దర్శకుడు. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తోపాటు అమ్మవారి రూపంలో ఉన్న నయనతార ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని, వినోదంతోపాటు అబ్బురపరిచే అంశాలతో సుందర్.సి ఈ సినిమాను రూపొందిస్తున్నారని, సుందర్.సి, నయనతార తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయని మేకర్స్ తెలిపారు.
వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటైర్టెన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ ఇషారి, కె.గణేశ్ ఐవీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్రరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: గోపీ అమర్నాథ్, సంగీతం: హిప్ హాప్ అది.