Viswam | టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్ (Gopichand)-శ్రీను వైట్ల (Sreenu Vaitla) కాంబినేషన్లో వస్తోన్న చిత్రం విశ్వం (Viswam). Gopichand 32గా వస్తోన్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇటీవలే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్‌తో కలిసి తెరకెక్కిస్తు్న్నారు.
ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువను విడుదల చేయగా.. సూపర్ స్టైలిష్‌గా సాగుతున్న పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి మొండితల్లి పిల్ల నువ్వు సాంగ్ విడుదల చేశారు. శ్రీహర్ష ఎమని రాసిన ఈ పాటను ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో సాహితి చాగంటి పాడింది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో సాగనున్నట్టు లిరికల్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు శ్రీనువైట్ల.
ఇప్పటికే లాంచ్ చేసిన జర్నీ ఆఫ్ విశ్వం వీడియో ఫన్, సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీలో కావ్యథాపర్ హీరోయిన్గా నటిస్తోంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ మూవీకి గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు.
గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అని ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో నరేశ్, ప్రగతి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విశ్వం సెకండ్ సింగిల్..
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?
మొరాకన్ మగువ సాంగ్..
విశ్వం టీజర్..