ఇండియాలో అత్యధిక సినిమాలు హీరోగా నటించిన రికార్డులు అన్నీ మలయాళ నటులకే సాధ్యమయ్యాయి. లెజెండరీ నటుడు ప్రేమ్ నజీర్ దాదాపు 700 సినిమాలకుపైగానే హీరోగా నటించాడు. అలాగే ఆయన తర్వాత మలయాళంలోనే మరో హీరో కూడా 400 సినిమాల వరకు హీరోగా నటించాడు. ఆయనెవరో కాదు..మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty). ఈ మధ్యే నటుడిగా 50ఏళ్లు పూర్తి చేసుకున్నాడు ఈయన. ఇన్నేళ్లలో 400 సినిమాలకుపైగా నటించి మెగాస్టార్ అయ్యాడు మమ్ముట్టి. అందులో చాలా వరకు విజయాలే ఉన్నాయి. నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసిన మమ్ముట్టి పుట్టిన రోజు నేడు. సెప్టెంబర్ 7న ఈయన జన్మించాడు. దాంతో మమ్ముట్టి జన్మదిన వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఈయన ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఉన్నాయి. 1980లలో మమ్ముట్టి ఎంత వేగంగా సినిమాలు చేశాడో ఒక్క ఉదాహరణ చాలు చెప్పడానికి. అప్పట్లో ఏడాదికి 34 సినిమాలు విడుదల చేసాడు. ఇది ఓ రికార్డు. అలాగే నాలుగేళ్లలోనే 120 సినిమాలకు పైగా నటించాడు మమ్ముట్టి. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఏడాదికి 17 సినిమాలు విడుదల చేస్తేనే ఔరా అనుకున్నాం కానీ మలయాళంలో ఈయన 30 సినిమాలు విడుదల చేసాడు. అలా చాలా తక్కువ సమయంలోనే 400 సినిమాల వరకూ హీరోగానే నటించి మెప్పించాడు మమ్ముట్టి. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలలో మమ్ముట్టి కంటే తోపు మలయాళంలో మరెవరూ లేరనేది కాదనలేని సత్యం.
మమ్ముట్టీ కెరీర్లో ఎన్నో రికార్డులున్నాయి కానీ ఓ అరుదైన రికార్డు కూడా ఆయన దగ్గరే ఉండిపోయింది.అదే ఆయన తొలి సినిమా విడుదల కాకపోవడం. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే మమ్మట్టి హీరోగా నటించిన తొలి సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆయనకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా మమ్ముట్టి సినిమా విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం.
అప్పట్లో ఆయన లా చదవడం పూర్తైన తర్వాత వెంటనే హీరో అవకాశం వచ్చింది. అలా దేవ లోకం (Deva lokam) సినిమాతో తొలిసారి హీరో అయ్యాడు మమ్ముట్టి. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఏదేమైనా తొలి సినిమా విడుదల కాకపోయినా కూడా ఏడాదికి 30 సినిమాలకు పైగా విడుదల చేసిన హీరోగా చరిత్ర సృష్టించాడు మమ్ముట్టి.
Aditi Rao Hydari | చీరకే అందం తెచ్చిన హైదరాబాదీ భామ
Dubai sheik SP balu song| దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట..వీడియో వైరల్
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?